Panduranga mahatyam movie songs lyrics |Get Telugu Lyrics

Get Telugu Lyrics:-
అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా //2//

చరణం1⃣
పదినెలలు నను మోసి పాలిచ్చి పెంచి
మది రోయక నాకెన్నో ఊడిగాలు చేసినా
ఓ తల్లీ నిన్ను నలుగురిలో నగుబాటు చేసితి
తలచకమ్మ తనయుని తప్పులు క్షమియించవమ్మా
అమ్మా ... అమ్మా ...

చరణం 2⃣
దేహము, విజ్ఞానము, బ్రహ్మోపదేశమిచ్చి
ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని
కనుగానని కామమున ఇలువెడల నడిపితి
కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్నా
నాన్నా ... నాన్నా ...

చరణం 3⃣
మారిపోతినమ్మా నాగతి ఎరిగితినమ్మా
నీమాట దాటనమ్మ ఒక మారు కనరమ్మా
మాతా పిత పాద సేవే
మాధవ సేవేయని మరువనమ్మా//2//
నన్ను మన్నించగ రారమ్మా
ఏ పాదసీమ కాశీప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము
ఏ పాదపూజ రమాపతి శరణాబ్జపూజలకన్ననూ పుణ్యతమము
ఏ పాదతీర్ధము పాపసంతాపాగ్ని ఆర్పగా జారిన
అమృతఝరమూ
ఏ పాదస్మరణ నాగేంద్రశయను ధ్యానంబుకన్ననూ
మహానందకరము
అట్టి పితరుల పదసేవ ఆత్మ మరచి
ఇహపరంబులకెడమై తపించువారి
కావగలవారు లేరూ ! లేరు ఈ జగాన వేరే
నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా! నాన్నా!
ఆ ఆ ఆ అమ్మా! నాన్నా!
Get Telugu Lyrics

Comments