సంగీతం : ఘంటసాల
నేపధ్య గానం : లీల
సాకీ :
తుషార శీతల సరోవరాన.. అనంత నీరవ నిశీధిలోన
ఈ కలువ నిరీక్షణ...నీ కొరకే.. రాజా... వెన్నెల రాజా....
పల్లవి :
కలనైనా నీ వలపే..
కలనైనా నీ వలపే.. కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే..
చరణం 1 :
కలువ మిఠారపు కమ్మని కలలు...
కలువ మిఠారపు కమ్మని కలలు...
కళలూ కాంతులూ నీ కొరకేలే..
కళలూ కాంతులూ నీ కొరకేలే..
చెలియారాధన సాధన నీవే..
జిలిబిలి రాజా జాలి తలచరా
కలనైనా నీ వలపే..
కలనైనా నీ వలపే.. కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే..
చరణం 2 :
కనుల మనోరధ మాధురి గాంచి...ఆ ..ఆ..ఆ...
కనుల మనోరధ మాధురి గాంచి...
కానుక చేసే వేళకు కాచి..
కానుక చేసే వేళకు కాచి...
వాడే రేకుల వీడని మమతల
వేడుచు నీకై వేచి నిలచెరా...
కలనైనా నీ వలపే..
కలనైనా నీ వలపే.. కలవరమందైనా నీ తలపే
కలనైనా నీ వలపే..
Comments
Post a Comment